బిసిసిఐ మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకొని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించింది అన్న విషయం తెలిసింది ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ లీక్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది ఇక ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పాలి ఎంతో మంది ప్లేయర్లు మంచి ప్రదర్శన చేసి రికార్డులు కొల్లగొట్టడం లాంటివి చేస్తున్నారు కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. వరుసపరాజుయాలతో సతమతమవుతుంది అని చెప్పాలి ఏకంగా ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేక వరుసగా అయిదు పరాజ్యాలను మూటగట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.


 కానీ ఆరో మ్యాచ్లో మాత్రం ఇటీవల ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది అని చెప్పాలి ఈ క్రమంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయని చెప్పాలి. ఇదిలా ఉంటే అటు బెంగళూరు జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతున్న.. ఇక ఆ జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న ప్లేయర్ మాత్రం ఒక అరుదైన రికార్డును సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించింది అని చెప్పాలి.


 ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు ప్లేయర్ ఎల్లిస్ పెర్రి  ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ఆమె వేసిన మూడో ఓవర్ లోని ఐదవ బంతిని 130.5 కిలోమీటర్ల వేగంతో విసిరింది.  అయితే మహిళల టి20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన బంతి కావడం గమనార్హం. గతంలో శబనామ్ ఇస్మాయిల్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి మహిళా క్రికెట్లో ఫాస్టెస్ట్ బంతిగా ఉండేది.  ఇక ఇటీవల ఎల్లిస్ పెర్రి ఆ రికార్డును బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl