
దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండూల్కర్ తన ఆట తీరుతో ఎన్నో అద్వితీయమైన విజయాలను కూడా అందించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ పురుష క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో భారత క్రికెట్లో రికార్డులు సృష్టించాడు సచిన్ టెండూల్కర్. ఇక సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితోనే ఎంతోమంది యువ ఆటగాళ్లు కూడా క్రికెట్ ని ప్రొఫెషన్ గా మార్చుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే సచిన్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే.
ఇటీవల సచిన్ తన కెరీర్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. 2003లో వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఆ ఆసక్తి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2003 ప్రపంచ కప్ లో పాకిస్తాన్తో మ్యాచ్లో ముందు రోజు నేను రాత్రి నిద్ర పోలేదు. ఇక ఆ మ్యాచ్ లో షోయబ్ అక్తర్ బౌలింగ్ లో కొట్టిన సెక్స్ నా కెరియర్ లోనే బెస్ట్.. దానిని ఎప్పటికీ మరిచిపోలేను అంటూ సచిన్ టెండూల్కర్ చెప్పవచ్చాడు. కాగా ఆరోజు జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 98 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు.