నేడు (మార్చి 19) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తన పేరు మీద ఒక ప్రత్యేక రికార్డుని నమోదు చేసే ఛాన్స్ ఉంది.అదేంటంటే.. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా రాహుల్ నిలవనున్నాడు.ఇక ఈ విషయంలో శిఖర్ ధావన్ రికార్డు సృష్టించి మొదటి స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ కేవలం 48 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు వేల వన్డే పరుగులు చేశాడు.కేఎల్ రాహుల్ అయితే ఇప్పటి దాకా 52 వన్డేలు ఆడాడు. ఇక్కడ అతను 50 ఇన్నింగ్స్‌ల్లో  మొత్తం 1945 పరుగులు చేశాడు.అంటే రెండు వేల పరుగులకు కేవలం 55 పరుగుల దూరంలో ఉన్నాడు ఈ సూపర్ బ్యాట్స్ మెన్. ఇక గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేసిన తీరుని కనుక చూస్తే.. ఈ అదిరిపోయే ఘనత సాధించడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు.ఇక చివరి వన్డే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 75 పరుగుల ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.


ఇండియా తరపున అత్యంత వేగంగా 2000 వన్డే పరుగులు పూర్తి చేసిన టాప్-5 భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ నిలిచాడు. శిఖర్ ధావన్ కేవలం 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డుని అధిగమించాడు. శిఖర్ ఇక్కడ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (52 ఇన్నింగ్స్‌లు), సౌరవ్ గంగూలీ (52 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లీ (53 ఇన్నింగ్స్‌లు) ఇంకా అలాగే గౌతమ్ గంభీర్ (61 ఇన్నింగ్స్‌లు) ఈ లిస్టులో టాప్-5లో ఉన్నారు.గత కొంతకాలం నుంచి క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో కెఎల్ రాహుల్ చాలా ఘోరంగా విఫలమవుతున్నాడు. అందువల్ల రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో మూడు జట్ల వైస్ కెప్టెన్సీ కూడా అతని చేతుల్లో లేకుండా పోయింది. అతను ఇప్పటికే టీ20 జట్టు నుంచి కూడా దూరమయ్యాడు. దీంతో టెస్ట్ జట్టు ప్లేయింగ్-11 నుంచి కూడా అతన్ని తొలగించవలసి వచ్చింది. ఇక వన్డేల్లో అతనిపై టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం మాత్రం అలాగే ఉంచింది. అయితే ఇక్కడ అతను తన బ్యాటింగ్ ఆర్డర్‌ను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. గతంలో ఓపెనర్‌గా ఆడిన రాహుల్ ఇక ఇప్పుడు వన్డేల్లో ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు.ఒక రకంగా ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పటి దాకా అతనికి చాలా కలిసివచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: