
అలాంటి చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. నిజంగా ఐపీఎల్ లో ఆడుతుంది అందరికీ తెలిసిన ఛాంపియన్ జట్టేనా అనే అనుమానం చెన్నై ప్రదర్శన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చింది. ఏకంగా పాయింట్ల పట్టికలో చివరన నిలిచి నాకౌట్ దశకు చేరుకోకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ ఏడాది మాత్రం కొత్త ఆటగాళ్లని జట్టులో చేర్చుకుని ఎంతో బలంగా బరిలోకి దిగాలని భావిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక టైటిల్ గెలవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది.
ఇలాంటి సమయం లో ఇక జట్టు లో ఉన్న కీలక ప్లేయర్లు గాయం బారిన పడుతూ దూరం అవుతూ ఉండడం తో అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆల్ రౌండర్ జెమిసన్ టోర్నీ మొత్తానికి దూరం కాగా ఇక ఇప్పుడు ఫేసర్ ముకేశ్ చౌదరి కూడా ఐపీఎల్ కు దూరమైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వెన్ను నొప్పి తో బాధపడుతున్న ముఖేష్ పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో సీజన్ కు దూరం కాబోతున్నాడు. కాగా పవర్ ప్లే లో అద్భుతంగా బౌలింగ్ చేసే ఈ యువ ఆటగాడు జట్టులో దీపక్ చాహార్ లేని లోటును తీర్చి మంచి ప్రదర్శన చేశాడు.