నేటి నుంచి 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమైపోతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక కొన్ని జట్లకు మాత్రం ఊహించని షాకులు  తగులుతున్నాయి. ఇక దీనికి కారణం ఇక జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ దూరమవుతూ ఉండడమే. జట్టుకు ఉపయోగపడతారని నమ్మకాన్ని పెట్టుకుని వేలంలో కోట్ల రూపాయల కుమ్మరించి మరి కొనుగోలు చేసిన ఆటగాళ్లు గాయం బారిన పడుతూ చివరికి టోర్నీ మొత్తానికి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.



 ఇక అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలాయ్. జట్టులో ఉన్న పలువురు కీలక ఆటగాళ్లు గాయం కారణంగా దూరమయ్యారు. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఏకంగా చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని ఇటీవల గాయం బారిన పడ్డాడట. నేటి నుంచే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ప్రస్థానం మొదలు కాబోతుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మొదటి మ్యాచ్ ఆడబోతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇలాంటి సమయంలో ఏకంగా ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అభిమానులకు తెలిసి ఆందోళనలో పడేసింది.


 గత కొన్ని రోజుల నుంచి కూడా మహేంద్ర సింగ్ ధోని ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోని ఎడమ కాలికి గాయమైందట. దీంతో ఇక గుజరాత్ టైటాన్స్ తో నేడు జరగబోయే తొలి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయ్ అన్నది తెలుస్తుంది. దీంతో అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. కాగా నేడు సాయంత్రం జరిగే ప్రెస్ మీట్ లో దీనిపై క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: