2023 ఐపీఎల్ సీజన్ లో అన్ని జట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయ్. ఈ క్రమంలోనే ఏ జట్టు టైటిల్ ని ఎగరేసుకుపోతుంది అన్నది కూడా ముందుగా ఊహించలేని విధంగానే ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఇక నువ్వా నేనా అన్నట్లుగానే అన్ని జట్లు కూడా తలపడుతూ ఉండటం గమనార్హం. అయితే ఇలా టైటిల్ గెలవడమె లక్ష్యంగా అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకున్న సమయంలో కొన్ని జట్లకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా కీలక ఆటగాళ్లు దూరం అవుతూ ఉండడంతో ఆయా జట్ల ప్రణాళికలు తారుమారు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకు కూడా అటు అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా మ్యాచ్లు ఆడటంతో కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడి ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లలో ఆడుతున్న సమయంలో కొంతమంది గాయాల బారిన పడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కోల్కతా జట్టుకు కూడా ఇలాంటి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఇప్పటికే కోల్కతా జట్టుకు 2023 ఐపీఎల్ సీజన్లో శుభారంభం లభించలేదు. మొదటి మ్యాచ్ లోనే ఓటమి చవి చూసింది.


 అలాంటి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తర్వాత మ్యాచ్లో పుంజుకోవాలి అని అనుకుంటున్న సమయంలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ప్రస్తుతం కోల్కతా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న షకీబ్ ఆల్ హసన్ ఇక ఈ సీజన్ కు అందుబాటులో ఉండడం లేదన్నది తెలుస్తోంది. అతని ప్లేస్ లో మరో విదేశీ ఆటగాడిని తీసుకోవాలని కోల్కతా జట్టు యాజమాన్యం భావిస్తుందట. అయితే అందుకు ఆటో షకీబ్ ఉల్ హసన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈసారి మినీ వేలంలో అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl