మొన్నటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా కనిపించని ఎంతోమంది ప్లేయర్లు ఇక ఇప్పుడు ఐపీఎల్ లో మాత్రం మళ్లీ  మునిపటి ఫామ్  ను అందుకొని అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తిరిగి మళ్లీ జాతీయ జట్టులోకి సెలక్ట్ అవ్వడమె లక్ష్యంగా తమ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. ఇలా దేశం తరఫున మళ్లీ ప్రాతినిధ్యం వహించాలని ఆశపడుతున్న ఆటగాళ్లలో.. అటు భారత సీనియర్ ఓపెనర్ అయిన శిఖర్ ధావన్ కూడా ఒకరు అని చెప్పాలి.


 ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఒకవైపు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపిస్తూనే మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలను కూడా అందిస్తూ ఉన్నాడు  ధావన్. అతని దూకుడు చూస్తే ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టును అటు టైటిల్ విజేతగా నిలిపే లాగే కనిపిస్తున్నాడే అని ఇక ఆ జట్టు అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 66 బంతుల్లోన 99 పరుగులు చేసి ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు.



 అయితే శిఖర్ ధావన్ ప్రదర్శన నేపథ్యంలో గతంలో ధావన్ పై కామెంటేటర్ హర్ష భోగ్లే చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో ధావన్ 56 బంతులో 86 పరుగులు చేయగా.. ధావన్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ఉందని హర్ష భోగ్లే కామెంట్ చేశాడు. స్ట్రైక్ రేట్ పెంచుకోవాలి అంటూ సూచించాడు. ఇక ఇటీవల సన్ రైజర్స్ తో మ్యాచ్లో 66 బంతుల్లో 99 పరుగులు చేశాడు ధావన్. ఇక ఈ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. హర్ష భోగ్లేని ట్యాగ్ చేస్తూ.. ఈ మాత్రం స్పీడ్ సరిపోతుందా.. స్ట్రైక్ రేట్ ఓకేనా అంటూ కౌంటర్లు వేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl