ఇటీవలే గుజరాత్ టైటాన్స్, కోల్కతా జట్ల జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో చివరి ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టి అసమాన్యమైన ప్రదర్శనతో జట్టును గెలిపించిన యువ ప్లేయర్ రింకు సింగ్ ఒక్కసారిగా ఐపీఎల్ లో హీరోగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ఆడుతున్న మిగతా ప్లేయర్స్ దగ్గర నుంచి అటు మాజీ ప్లేయర్స్ వరకు కూడా అందరూ అతని గురించి చర్చించుకుంటున్నారు. ఇక ప్రేక్షకులు అయితే అతని ప్రతిభకు సలాం కొడుతున్నారు అని చెప్పాలి. అనుభవం ఉన్న ఆటగాళ్లకే చివరి ఓవర్లో ఇలాంటి సిక్సర్లు కొట్టడం అసాధ్యం.. అలాంటిది అంతంత  మాత్రం అనుభవం ఉన్న రింకూ సింగ్ ఇలాంటి ప్రదర్శన చేయడం నిజంగా అద్భుతం అంటూ అతన్ని పొగడ్తలతో ఆకాశానికెత్తిస్తున్నారు.



 కోల్కతా జట్టు విషయం సాధించాలి అంటే చివరి ఓవర్ లో 29 పరుగులు కావాల్సిన సమయంలో ఇక స్ట్రైక్ లో ఉన్న ఉమేష్ యాదవ్ సింగిల్ తీసి రింకు సింగ్ కు ఇచ్చేశాడు.  దీంతో ఆ తర్వాత తనకు దొరికిన 5 బంతులను కూడా మైదానంలో ఐదువైపులు సిక్సర్లు కొట్టాడు రింకు సింగ్. ఈ క్రమంలోనే అతను ఎవరు.. అతని బ్యాగ్రౌండ్ ఏంటి.. ఎలా క్రికెటర్ గా ఎదిగాడు అనే విషయాలను తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలోనే రింకు సింగ్ బ్యాట్ కి సంబంధించిన ఒక స్టోరీ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రింకు సింగ్ విధ్వంసం సృష్టించిన సమయంలో పట్టుకున్న బ్యాట్ అతనిది కాదట.


 విధ్వంసకరమైన ఇన్నింగ్స్ సమయంలో రింకు సింగ్ చేతబట్టిన బ్యాట్ తోటి ఆటగాడు అయినా నితీష్ రానాది అన్నది తెలుస్తుంది. ఈ విషయంపై ఇటీవల నితీష్ రానా మాట్లాడాడు. ఆ బ్యాడ్ నాకు చాలా సెంటిమెంట్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆ బ్యాట్ తోనే రన్స్ చేశాను. దానితో ఆడతాను అని రింకు అడిగాడు. నేను ఇవ్వాలని అనుకోలేదు. కానీ డ్రెస్సింగ్ రూమ్ లో ఎవరో ఆ బ్యాట్ ని అతనికి ఇచ్చేశారు. ఇక తన ఫేవరెట్ బ్యాట్ పట్టుకొని రింకు చెలరేగిపోయాడు అంటూ మ్యాచ్ అనంతరం అటు నితీష్ రానా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl