ఐపీఎల్ 2023లో భాగంగా ఈరోజు మరో ఆసక్తికర మ్యాచ్ కి రంగం సిద్దమైంది. మొహాలీలో గుజరాత్ టైటాన్స్‌ టీంతో పంజాబ్ కింగ్స్ టీం ఢీ కొట్టనుంది.ఇక ఈ సీజన్‌లో రెండు జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. రెండు జట్లు రెండు మ్యాచుల్లో విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో ఓడిపోవడం జరిగింది. విజయాల పరంగా సమంగా నిలిచినప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో గుజరాత్ టీం నాలుగో స్థానంలో ఉండగా, పంజాబ్ టీం ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో విజయం సాధించి తమ స్థానాలను మెరుగుపరచుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. సొంత గడ్డపై ఆడుతుండడం పంజాబ్‌ టీంకు కాస్త కలిసివచ్చే అంశం.ఇక ఇంగ్లాండ్ ఆటగాడు లియాన్ లివింగ్ స్టోన్ రాకతో పంజాబ్ బ్యాటింగ్ బలం బాగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న అతడిపైనే అందరి కళ్లు ఉంటాయి. మరో ఫారెన్ ఆటగాడు కగిసో రబాడ కూడా వచ్చాడు. సన్‌రైజర్స్ మ్యాచ్‌కే అందుబాటులోకి వచ్చినా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈరోజు మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ లు ఆడనుండగా ఇక వన్‌డౌన్‌లో లివింగ్ స్టోన్ వస్తాడు.గత మ్యాచ్‌లో భానుక రాజపక్స ప్లేస్ లో ఆడిన మాథ్యూ షార్ట్ ఈ సారి బెంచికే పరిమితం కానున్నాడు. 


ఇప్పటి దాకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికి సికందర్ రజాకు మరో ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మిడిల్ ఆర్డర్ లో షారుక్ ఖాన్‌, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బార్ ఇంకా సామ్ కర్రన్‌లతో కూడిన బ్యాటింగ్ విభాగం చాలా బలంగానే ఉంది. అయితే.. ఇక బౌలింగ్‌లో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చాలా ఆసక్తికరంగా ఉంది.అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు రాహుల్ చహర్‌లకు తుది జట్టులో చోటు కంఫర్మ్. కగిసో రబడ ఇంకా నాథన్ ఎల్లిస్‌లలో ఒకరిని తీసుకోవచ్చు.అయితే అనారోగ్యం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్థిక్ పాండ్యా ఆడలేదు.అతడి ప్లేస్ లో రషీద్ ఖాన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే.. పంజాబ్‌ టీంతో మ్యాచ్‌కు హార్థిక్ పాండ్య వచ్చేస్తున్నాడు.తమ కెప్టెన్ రాకతో గుజరాత్ బలం పెరిగినటైంది. శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ ఇంకా రాహుల్ తెవాటియాలలో ఏ ఇద్దరు రాణించిన భారీ స్కోరు సాధించవచ్చు. రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్ ఇంకా జాషువా లిటిల్‌లను పంజాబ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారా అన్నదానిపైన ఈరోజు మ్యాచ్ ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: