ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక నరాలు తెగే ఉత్కంఠ మధ్య క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందించింది ఈ మ్యాచ్. ఒకరిపై ఒకరూ పైచేయి సాధించడం కాదు. చివరి బంతి వరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది. చివరి ఓవర్లో ధోని సిక్సర్లతో మెరుపులు మెరూపిస్తూ ఉండడంతో చెన్నై జట్టు విజయం సాధించడం ఖాయమని అటు అభిమానులు అందరూ కూడా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి సమయంలో సందీప్ శర్మ అద్భుతమైన బంతులను సంధించి ఇక పరుగులను కట్టడి చేయడంతో చివరికి మూడు పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.


 అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక వారి హోమ్ గ్రౌండ్ గా పిలుచుకునే చపాక్ స్టేడియంలో రాజస్థాన్ చేతిలో ఓడిపోవడం అటు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. అదే సమయంలో ఇక చెన్నై హోమ్ గ్రౌండ్ అయినా చపాక్ స్టేడియంలో ఇటీవల చెన్నై జట్టుపై విజయం సాధించిన రాజస్థాన్ అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. దాదాపు ఏకంగా 15 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం పై విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు.



 గత 15 ఏళ్లుగా చపాక్ స్టేడియంలో ఎన్నిసార్లు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ జరిగిన కూడా అటు రాజస్థాన్ రాయల్స్ వరుసగా ఓడిపోతూనే వస్తుంది అని చెప్పాలి. 15 ఏళ్ల తర్వాత మొదటిసారి విజయం సాధించింది. ఈ స్టేడియంలో 2008లో తొలిసారి పది పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది అని చెప్పాలి. ఆ తర్వాత 2010, 2011, 2012, 2013, 2015, 2019 సీజన్లలో చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది రాజస్థాన్. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం తమ ఓటముల పరంపరకు బ్రేక్ వేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: