ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం ఏది అంటే ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడు చెప్పే మాట ముంబై ఇండియన్స్ అని. అతి తక్కువ సమయంలోనే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న టీం గా కొనసాగుతూ ఉంది ముంబై ఇండియన్స్. అంతే కాదు అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన జట్టుగాను రికార్డు సృష్టించింది అనే విషయం తెలిసిందే. ఎప్పుడు అసాధారణమైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థి పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది అని చెప్పాలి.



 అలాంటి ముంబై ఇండియన్స్ గత ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి మాత్రం కాస్త పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులు అందరిని కూడా నిరాశ పరుస్తూ ఉంది అని చెప్పాలి. కానీ ఈ ఏడాది మాత్రం వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయినప్పటికీ... ఆ తర్వాత మాత్రం ఊహించని రీతిలో పుంజుకుని ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ ఉంది. ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో సైతం ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విజయం ద్వారా అటు ముంబై ఇండియన్స్ ఒక అరుదైన రికార్డు సృష్టించింది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఐపీఎల్ హిస్టరీ లో ఒక జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది ముంబై ఇండియన్స్. కోల్కతా జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ ఘనత సాధించింది. ఇప్పటివరకు కోల్కతా జట్టును 23 సార్లు ఓడించింది ముంబై ఇండియన్స్. ఇక అదే సమయంలో రోహిత్ శర్మ కోల్కతా జట్టుపై ఒకవేయి 40 పరుగులు చేయగా.. ఒక జట్టుపై ఇప్పటివరకు ఇదే అత్యధిక పరుగులు కావడం గమనార్హం. కాగా నేడు ముంబై ఇండియన్స్ హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది ముంబై ఇండియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl