ఐపీఎల్ మొదలైంది అంటే చాలు క్రికెట్ లవర్స్ అందరిని ఉర్రూతలూగించే బ్యాటింగ్ ప్రదర్శనలు అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలు ప్రతి మ్యాచ్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతకుమించి ఇక మైదానంలో ఫీల్డర్లు చేసే విన్యాసాలు అయితే ప్రేక్షకులు అందరిని కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ప్రతి మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉంటాయి. ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ కాస్త మ్యాచ్ కు హైలెట్గా మారిపోయింది.


 ఇలా మ్యాచ్ లో స్టన్నింగ్ క్యాచ్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ఎవరో కాదు మన సన్రైజర్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఐరన్ మార్కరమ్ నిన్నటి మ్యాచ్లో అద్భుతమైన క్యాచ్తో మెరిసాడు మార్కరమ్. మార్కో జాన్సన్ బౌలింగ్లో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మిడ్ ఆఫ్ దిశగా సూర్య కుమార్ యాదవ్ భారీ షాట్ ఆడాడు అని చెప్పాలి. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మర్కరమ్ ఎడమవైపుకు పరిగెత్తుకుంటూ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాక్ అయిన సూర్య కుమార్ యాదవ్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు అని చెప్పాలి.



 ఇక అంతకుముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ల క్యాచ్లు కూడా తీసుకుంది మార్కరమ్ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే సన్రైజర్స్ జట్టు కెప్టెన్ మార్కరమ్ అటు అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఒక మ్యాచ్ ఇన్నింగ్స్ లో తొలి మూడు క్యాచ్ లను ఓకే ప్లేయర్ తీసుకోవడం ఇది నాలుగోసారి. ఈ రికార్డును ఇంతకుముందు కేన్ రిచర్డ్ సన్, హార్దిక్ పాండ్యా, ఫ్యాబ్ డూప్లెసెస్ సాధించారు అని చెప్పాలి. అయితే ఇలా గెలుపు కోసం ఎంతలా ప్రయత్నించినా చివరికి సన్రైజర్స్ కి ఓటమి తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: