ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు అనే చర్చ తెరమీదకి వస్తే అందులో మొదటగా వినిపించే పేరు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇప్పటివరకు జట్టును తన కెప్టెన్సీ తో ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ని ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా కూడా నిలిపాడు. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇలా ఐదు సార్లు టైటిల్ గెలవలేదు అని చెప్పాలి. అయితే కేవలం కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఆటగాడిగాను ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పాలి.



 ఇకపోతే ఐపీఎల్ హిస్టరీలో కేవలం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమైన ఓ అరుదైన రికార్డును ఇటీవల రోహిత్ శర్మ కూడా సాధించాడు. ఇటీవల ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో అటు ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై విజయం సాధించడమే కాదు అటు రోహిత్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో 6 వేలపరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా ఘనత సాధించాడు రోహిత్ శర్మ.


 హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో 28 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డును సాధించాడు అని చెప్పాలి. ఈ జాబితాలో అటు రోహిత్ శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ 6844 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ 6477 పరుగులతో ఈ లిస్టులో రెండవ స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 6109 పరుగులతో ఈ లిస్టులో ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే రోహిత్ శర్మ ఇలా అరుదైన ఘనత సాధించడం పై అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl