ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే లీగ్ మ్యాచ్లు ముగుస్తున్న నేపథ్యంలో.. ఇక అన్ని జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ హోరాహోరీగా పోరును కొనసాగిస్తూ ఉన్నాయి.  ఇలాంటి సమయంలోనే కొన్ని జట్లకు ఊహించని ఎదురూ దెబ్బలు తగులుతున్నాయి. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఇక గాయాల కారణంగా జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాగే వరుస విజయాలతో జోరు మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.


 ఏకంగా 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి జరిగిన మినీ వేలంలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ ని అటు 16.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై జట్టు యాజమాన్యం
 అయితే అతను జట్టుకు ఎంతో ఉపయోగపడతాడని.. ఇక జట్టు టైటిల్ విన్నర్ గా నిలవడంలో కీలక పాత్ర వహిస్తాడని ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంది. అయితే బెన్ స్టోక్స్ ఆడిన కొన్ని మ్యాచ్లలో ఎందుకొ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.  అతనికి 16.25 కోట్లు పెట్టి చెన్నై యాజమాన్యం తప్పు చేసిందేమో అనే విధంగానే అతని ప్రదర్శన కొనసాగింది.



 సరేలే తర్వాత మ్యాచ్లలో అయినా పుంజుకుంటాడు అనుకునే లోపే అతను గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇటీవల గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్నాను అంటూ ప్రకటించాడు. కానీ ప్రస్తుతం చెన్నై జట్టుకి మరో ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే స్టోక్స్ కీ అయినా గాయం తిరగబెట్టినట్లు కోచ్ ఫ్లెమింగ్ ఇటీవల తెలిపారు. మరో వారం పాటు అతను అందుబాటులో ఉండడని ప్రకటించారు. ఇప్పుడు వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్లు ఆడగా బెన్ స్టోక్స్ కేవలం తొలి రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: