సాధారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో బౌలింగ్ చేయడానికి అటు టెస్ట్ ఫార్మాట్లో బౌలింగ్ చేయడానికి ఎంతో తేడా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే పరిమిత ఓవర్ల  ఫార్మాట్లో తక్కువ బంతుల్లో బ్యాట్స్మెన్లు ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. దీంతో తొందరపాటులో ఏదైనా తప్పు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం బ్యాట్స్మెన్లు ఎక్కువ బంతులను వృధా చేసిన పర్వాలేదు. కానీ వికెట్ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీంతో ఇక బ్యాట్స్మెన్లు తప్పు చేయడానికి ఎక్కడ ఆస్కారం ఉండదు అని చెప్పాలి.



 దీంతో ఇక డిఫెన్స్ బ్యాటింగ్ ఆడుతున్న బ్యాట్స్మెన్లను వికెట్ తీయడం అంటే బౌలర్లకు ఒక ఛాలెంజ్ లాగే ఉంటుంది అని చెప్పాలి. అలాంటిది టెస్ట్ క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసి కొంతమంది బౌలర్లు మాత్రమే రికార్డులు సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే టెస్ట్ క్రికెట్లో వికెట్లు తీయడం ఒక ఎతైతే వేగంగా వికెట్లు తీయడం మరో ఎత్తు అని చెప్పాలి. ఇక ఇలా మెరుపు వేగంతో వికెట్లు తీసి ఏకంగా 71  ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు శ్రీలంక బౌలర్. ప్రస్తుతం ఐర్లాండ్, శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా పసికున ఐర్లాండ్ పై శ్రీలంక చెలరేగి ఆడుతుంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ప్రభాత్ జయ సూర్య ఒక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన స్పిన్ బౌలర్గా నిలిచాడు ప్రభాత్ జయసూర్య. ఇటీవలే ఐర్లాండ్తో గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో పలు వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. కేవలం 7 మ్యాచ్లలోనే 50 వికెట్లు తీశాడు ప్రభాత్ జయ సూర్య. అయితే 1951లో వెస్టిండీస్ స్పిన్నర్ వాలెంటైన్ 8 టెస్ట్ మ్యాచ్ లలో 50 వికెట్ల తీయగా ఇదే అత్యంత వేగంగా 50 వికెట్ల సాధించిన రికార్డుగా ఉంది. ఇప్పుడు ప్రభాత్ జయ సూర్య ఈ రికార్డును బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: