టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రి గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు భారత జట్టులో సేవలు అందించిన రవి శాస్త్రి.. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉన్నాడు. అంతేకాదు వ్యాఖ్యాతగా తన కామెంట్రీతో ఇక ప్రతి మ్యాచ్ ని కూడా మరింత ఉత్కంఠ భరితంగా మారుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వ్యాఖ్యాతగా సేవలు అందించిన రవి శాస్త్రి ఎవరు ఊహించిన విధంగా అటు భారత జట్టు హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.


 అనిల్ కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇలా రవి శాస్త్రి టీమిండియా హెడ్ కోచ్గా సేవలు అందించారు అన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లపాటు ఇలా కోచ్ గా వ్యవహరించారు. అయితే రవి శాస్త్రి కోచ్గా ఉన్న సమయంలో అటూ టీమ్ ఇండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. విరాట్- రవి శాస్త్రి ద్వయం ఎంతో విజయవంతంగా కొనసాగింది. అయితే రవి శాస్త్రి పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి హెడ్ కోచ్ బాధ్యతలు  చేపట్టాలి అనుకున్నప్పటికీ బీసీసీఐ పెద్దలు అందుకు అంగీకరించలేదు.



 ఇక రవి శాస్త్రి కోచ్గా తప్పుకున్నాడో లేదో విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం జరిగింది. ఇలా భారత క్రికెట్ లో అనూహ్యమైన మార్పులు జరిగాయి. అయితే ఇటీవలే తాను కోచ్గా ఉన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలను ఇటీవల అభిమానులతో పంచుకున్నాడు రవి శాస్త్రి. తాను భారత జట్టుకు హెడ్ కోచ్గా సేవలందించిన సమయంలో తనను ఒక్కసారి కూడా సెలక్షన్ మీటింగ్ కు పిలవలేదు అంటూ తెలిపాడు. ఏడేళ్ల పాటు జట్టులో ఉన్న నేను ఎప్పుడు సెలక్షన్ మీటింగ్ కి హాజరు కాలేదు. ఎవరూ కూడా ఆహ్వానించలేదు. కానీ భవిష్యత్తులో కోచ్ లను కూడా మీటింగ్కి పిలిస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl