ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది కొత్త ప్రతిభను తెరమీదకి తీసుకురావడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి రానించాలి అనుకునే ఎంతో మంది యువకులకు ఇక తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకునేందుకు ఒక మంచి వేదికను కల్పిస్తూ ఉంటుంది. ఐపీఎల్ లోనే ఐపిఎల్ లోకి వచ్చే ఎంతోమంది యువకులు ఒక్కసారిగా తమ ప్రతిభను సత్తా చాటి స్టార్లుగా మారిపోతూ ఉంటారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే ఐపిఎల్ 16వ సీజన్లో భాగంగా ఇటీవల  ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మరో యువ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో నేనున్నాను అంటూ జట్టు ఆదుకొని నమ్మకాన్ని కల్పించాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచింది అంటే దానికి అతను ఆడిన ఇన్నింగ్స్ ఏ కారణం అని చెప్పాలి. ఏకంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి సూపర్ 50 తో అలరించాడు అమన్ హకీమ్ ఖాన్.


 అతను ఢిల్లీ జట్టును ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. కాబట్టి ఆ తర్వాత ఇక ఢిల్లీ జట్టు  స్కోరుని కాపాడుకుంటూ చివరికి విజయం సాధించగలిగింది. బ్యాటింగ్ చేయడానికి ఎంతో కష్టంగా ఉన్నా పిచ్ పై 43 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు అమన్ ఖాన్. అతను ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ హాఫ్ సెంచరీ ద్వారా అరుదైన రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ లో ఏడూ లేదా అంతకంటే ఎక్కువ స్థానంలో వచ్చి 50 మార్క్ అందుకున్న మూడో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. అంతకుముందు అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్ ఈ ఘనత సాధించారు అని చెప్పాలి. కాగా ముంబై కి చెందిన అమన్ హకీమ్ ఖాన్ 2020-21 విజయ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్ ఏ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2021 -22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్లో అడుగు పెట్టాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl