
అయితే ప్రస్తుతం ఐపీఎల్ ఏమో కానీ ఐపీఎల్ కారణంగా అటు టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అన్నది అర్థమవుతోంది. ఎందుకంటే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లాండు వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా టీం తో ఈ ఫైనల్లో తలబడబోతుంది టీమిండియా. దీనికోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ కారణంగా ఇలా డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపికైన ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు.
ఇప్పటికే బుమ్రా లాంటి బౌలర్ లేకపోవడంతో టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం కాస్త వీక్ గానే కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఉమేష్ యాదవ్ గాయం బారిన పడ్డాడు. అతను డబ్ల్యూటిసి ఫైనల్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనే అనుమానం ఉంది. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపికైన జయదేవ్ సైతం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా గాయం బారిన పడ్డాడు. ఎడమ భుజానికి గాయం అవడంతో ఉన్నద్గత్ ఐపీఎల్ కి దూరమవుతున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయ్. అయితే ఆస్ట్రేలియా తో జూన్ 7 నుంచి ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం ఇక అతను అందుబాటులో ఉంటాడా.. అప్పటివరకు ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.