గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మంచి ప్రదర్శన కనబరుస్తూ వరుస విజయాలు అందుకుంటున్న లక్నో జట్టుకు ఇటీవలే ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. అన్ని జట్లకు కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ జట్టుకు దూరమవుతూ ఉంటే.. అటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మాత్రం ఏకంగా కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం బారిన పడి ఇక పూర్తిగా ఐపిఎల్ టోర్నీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. దీంతో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండా లక్నో ప్రస్థానం ఎలా కొనసాగుతుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.



 కేఎల్ రాహుల్ ప్రస్తుతం గాయం కారణంగా అందుబాటులో లేని నేపథ్యంలో.. ఇక అటు జట్టులో మరో కీలక ప్లేయర్ అయిన కృణాల్ పాండ్యా సారధ్య బాధ్యతలు  భుజాన వేసుకొని జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే కేఎల్ రాహుల్ కేవలం ఐపిఎల్ కు మాత్రమే కాదు ఐపీఎల్ ముగిసిన తర్వాత జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్ కీ కూడా దూరం కాబోతున్నాడు. అయితే ఇక కేఎల్ రాహుల్ స్థానంలో లక్నో జట్టులోకి ఎవరిని తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. కాగా కేఎల్ రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నారట.



 తర్వాత మ్యాచ్ లో  రాహుల్ స్థానంలో ఇక కరుణ్ నాయర్ తుది  జట్టులో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. కాగా కరుణ్ నాయర్ ఇప్పటివరకు ఐపిఎల్ లో 76 మ్యాచ్లు ఆడాడు. అయితే గత ఏడాది జరిగిన వేలంలో మాత్రం కరుణ్ నాయర్ ను ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. దీంతో అన్ సొల్డ్ ప్లేయర్ గానే మిగిలిపోయాడు. కానీ ఇప్పుడు కేఎల్ రాహుల్ గాయం బారిన పడటంతో అతనికి ఐపిఎల్ లో ఆడే అదృష్టం వరించింది అని చెప్పాలి. మరి వచ్చిన ఛాన్స్ ని కరుణ్ నాయర్ ఎలా వినియోగించుకొని సత్తా చాటుతాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: