ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఇష్టపడే టి20 ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ ఎంత విధ్వంసకరమైన  ప్లేయర్ అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. అంతేకాదు మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడుతూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి  దీంతో ఇక ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా సూర్య కుమార్ యాదవ్ అవతరించాడు అని చెప్పాలి.


 ఇలా మిస్టర్ 360 ప్లేయర్ అంటూ తనకు వచ్చిన బిరుదును నిలబెట్టుకుంటూ.. ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతున్నాడు. ఇక సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు టీవీలో వీడియో గేమ్ చూస్తున్నామేమో అనేంతల ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి   అయితే గత కొంతకాలం నుంచి ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీ20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. అయితే ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.


 అయితే కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడమే కాదు భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్లేయర్కు సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు సూర్య కుమార్ యాదవ్. టి20 ఫార్మాట్లో 900 రేటింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారతీయుడిగా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. ప్రస్తుతం సూర్యకుమార్ 908 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక ఇదే జాబితాలో 836 పాయింట్ లతో అటు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో 631 పాయింట్లతో విరాట్ కోహ్లీ 13వ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: