ఇటీవలే ఐపీఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఇప్పటికీ వార్తల్లో నానుతూనే ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలుపు ఓటములు పక్కన పెడితే అటు చెలరేగిన వివాదం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా విరాట్ కోహ్లీ, లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హక్ తో పాటు లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ తో దారుణంగా గొడవపడ్డాడు. అయితే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.



 బెంగళూరు జట్టు అయితే విజయం సాధించింది కానీ ఇక విరాట్ కోహ్లీ ప్రవర్తన పై ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 100% కోతను విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లీ తో పాటు గౌతమ్ గంభీర్ పై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు . అయితే మ్యాచ్ పూర్తయి రోజులు గడుస్తున్న ఇంకా ఈ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న గుజరాత్ చేతిలో లక్నో ఓడిపోవడంతో మంచి ఇన్నింగ్స్ ఆడిన శుభమన్ గిల్ ను ఉద్దేశిస్తూ కోహ్లీ చేసిన కామెంట్ వైరల్ గా మారింది. పాత గొడవను రెచ్చగొట్టేందుకే కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని అందరూ అనుకున్నారు.



 అయితే కోహ్లీ అలా అన్న తర్వాత గొడవలకు కేరాఫ్ అడ్రస్ అయినా నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నాడో ఏమో.. లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హక్ పెట్టిన పోస్ట్ ఇటీవల సంచలనంగా మారిపోయింది. ఇది చూసిన తర్వాత వీరిద్దరు గొడవ ఇప్పట్లో సర్దుమనిగేలా లేదు అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. ఇది జరిగిన వెంటనే నవీన్ ఉల్ హక్ ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక పోస్ట్ పెట్టాడు. మామిడి పండ్లు తింటూ స్వీట్ మ్యాంగోస్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇది కోహ్లీని ఉద్దేశించి అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ పూర్తయిన వివాదం మాత్రం సద్దుమనగడం లేదని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: