ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విరాట్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఐదు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.  అదే సమయంలో ఇక కొన్ని వివాదాలు కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇటీవల విరాట్ కోహ్లీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వహిస్తున్న లెట్ దేర్ బి స్పోర్ట్స్ అనే కార్యక్రమానికి హాజరయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ అయినా జతిన్ సప్రుతో జరిగిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఎన్నో విషయాలను పంచుకున్నాడు అని చెప్పాలి.



 ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో ని విరాట్ కోహ్లీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు కోహ్లీ. ధోని నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ధోని సహా కొంతమంది క్రికెటర్ల నుంచి చాలా నేర్చుకున్నా. మనల్ని నడిపిస్తున్న వ్యక్తులను ప్రతిసారి సంతోషంగా ఉంచలేము. ఎందుకంటే నిజం అనేది కొన్నిసార్లు సంతోషాన్ని ఇస్తే కొన్నిసార్లు మాత్రం బాధను ఇస్తుంది.



 అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం దృశ్య అది నెగిటివిటీగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందరూ కూడా సౌకర్యవంతమైన మార్గాలని కావాలనుకుంటారు. కానీ ఒక్కోసారి వీటిని విస్మరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూసే ధోరణి కీలక పాత్ర పోషిస్తుంది అన్నదే నా నమ్మకం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక ఇలాంటి జీవిత సత్యాలను ధోని లాంటి వ్యక్తుల నుంచి నేర్చుకున్నాను అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ధోని సారధ్యంలోనే విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నుంచి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ని కూడా అందుకున్నాడు  కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: