ఐపీఎల్ హిస్టరీలో ఏ జట్టు తరఫున ఆడిన కూడా మంచి ప్రదర్శన చేసి అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగిన వారిలో.  అటు జాస్ బట్లర్ కూడా ఒకడు అని చెప్పాడు. ప్రతి సీజన్లో కూడా అద్భుతమైన ఆట తీరుతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున జాస్ బట్లర్ ఇప్పటివరకు ఎన్నో అద్వితీయమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక కొన్నాళ్లపాటు అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా కూడా కొనసాగాడు.  అయితే ఈ ఏడాది కూడా జాస్ బట్లర్ నుంచి మంచి ప్రదర్శన వస్తుందని అంచనా వేశారు రాజస్థాన్ రాయల్స్ జట్టు అభిమానులు.



 కానీ ఊహించిన రీతిలో  బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో వరుసగా విఫలం అవుతూనే ఉన్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు బౌలర్లపై సిక్సర్లు ఫోర్లతో  విరుచుకుపడి పరుగుల సునామీ సృష్టించిన బట్లర్ ఇక ఇప్పుడు డబుల్ డిజిట్ స్కోర్ చేయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. అయితే అప్పుడే ఐపీఎల్ లో ఛాన్స్ దక్కించుకున్న యువ బౌలర్లు సైతం అటు బట్లర్ను పరుగులు చేయకుండా కట్టడి చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉండడం ఈ ఏడాది ఐపీఎల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఒకప్పుడు అరుదైన  రికార్డులు సృష్టించిన బట్లర్ ఇప్పుడు తన వైఫల్యంతో చెత్త రికార్డులను కూడా మూటగట్టుకుంటున్నాడు అని చెప్పాలి.



 ఇకపోతే ఇటీవల రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్ పేరిట ఒక చెత్త రికార్డు నమోదయింది. ఇటీవల జరిగిన మ్యాచ్లో జాస్ బట్లర్ డక్ అవుట్ అయ్యాడు. అయితే ఒకే సీజన్లో 4 సార్లు డక్ అవుట్ అయిన క్రికెటర్ల జాబితాలో చేరి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇక ఈ సీజన్లో జాస్ బట్లర్ నాలుగు సార్లు డక్ అవుట్ అవ్వగా.. అంతకుముందు హెర్షలే గిబ్స్ 2019, మిథున్ మాన్హన్ 2011, మనీష్ పాండే 2012, శిఖర్ ధావన్  2020, ఇయాన్ మోర్గాన్ 2021, నికోలస్ పూరన్ 2021 సీజన్లో నాలుగు సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl