ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో కాస్త తడబాటుకు గురైనట్లు కనిపించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం వరుస విజయాలు సాధిస్తూ పాయింట్లు పట్టికలో తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుంటూ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి కూడా గుజరాత్ తర్వాత ఎక్కువ పాయింట్లు సాధించిన టీం గా రెండో స్థానంలో కొనసాగింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇక ధోని తన సారథ్యంతో అదరగొడుతూ ఇక మరోసారి ప్రత్యర్థులను తికమక పెట్టి వరుస విజయాలను జట్టుకు అందిస్తున్నాడు.


 అదే సమయంలో ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ కూడా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ టీం తో మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భాగంగా మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజు గైక్వాడ్, డేవన్ కాన్వేలు రెచ్చిపోయారు. ఢిల్లీ బౌలర్ల పై వీర విహారం చేశారు. భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.


 అయితే ఇక ఈ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర వహించిన ఓపెనర్లు ఋతురాజు కైక్వాడ్, డేవన్ కాన్వేలు ఇక ఐపీఎల్ హిస్టరీలో ఒక అరుదైన రికార్డు సృష్టించారు. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఏకంగా 141 పరుగులు చేసింది ఈ జోడి. ఓవరాల్ గా ఈ సీజన్లో ఇది నాలుగు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం అని చెప్పాలి. కోహ్లీ, డూప్లిసిస్ సన్రైజర్స్ పై 172, ముంబై ఇండియన్స్ పై 148 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా సాహ, గీల్ జోడి లక్నోపై 142 పరుగుల భాగస్వామ్యం  నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl