రింకు సింగ్.. అప్పటివరకు క్రికెట్ లవర్స్ ఎవరికీ కూడా ఈ పేరు పెద్దగా తెలియదు. కానీ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఐపీఎల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి చూపు రింకు సింగ్ మీద పడింది అని చెప్పాలి. ఎందుకంటే చివరి ఓవర్లో 31 పరుగులు అవసరమైన సమయంలో ఇక దాదాపు కోల్కతా జట్టుకి పరాజయం ఖాయమైంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అప్పటివరకు డెత్ ఓవర్లలో మంచి గణాంకాలను నమోదు చేసిన యష్ దయాల్ బౌలింగ్లో ఇక పరుగులు రాబట్టడం చాలా కష్టమని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో రింకు సింగ్ అనే కుర్రాడు సృష్టించిన విధ్వంసం మాత్రం అందరిని ఆశ్చర్యానికి లోను చేసింది.


 సాధారణంగా డెత్ ఓవర్లలో బ్యాట్స్మెన్లు ఒత్తిడికి లోనై ఏదైనా తప్పు చేసి వికెట్ కోల్పోతూ ఉంటారు. కానీ రింకు సింగ్ మాత్రం అలాంటిదేమీ చేయలేదు. వరుసగా 5 సిక్సర్లు బాది ఒక పీడకల లాంటి రోజును మిగిల్చాడు.  అసాధ్యం అనుకున్న విజయాన్ని కోల్కతా జట్టుకు అందించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు రింగు సింగ్. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే కాదండోయ్ ఇక తర్వాత జరిగిన మ్యాచ్లో కూడా డెత్ ఓవర్లో మంచి ప్రదర్శన చేశాడు. ఇక ఇటీవలే లక్నో సూపర్ జెంట్స్ తో జరిగిన మ్యాచ్ లోను ఏకంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టును గెలిపించినంత పని చేశాడు.



 రెండు ఓవర్లలో కోల్కతా విజయానికి 40 పరుగుల అవసరమైన దశలో తనలోని పవర్ హిట్టర్ ను మరోసారి నిద్ర లేపాడు రింకు సింగ్. డెత్ ఓవర్లు అనగానే రింకు సింగ్ కి ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. సాధారణంగా డెత్ ఓవర్లలో కొండంత లక్ష్యం ముందు ఉంటే.. ఎవరికైనా సరే ఒత్తిడి సర్వసాధారణం. కానీ రింకు సింగ్ డెత్ ఓవర్లు అనగానే పూనకం వచ్చినట్లు చెలరేగిపోతున్నాడు. అయితే ఇక రింకు సింగ్ ఒకానొక సమయంలో అటు తన విధ్వంసంతో కోల్కతా జట్టుకు విజయాన్ని అందిస్తాడు అనుకున్నప్పటికీ.. చివరికి ఒక్క పరుగు తేడాతో కోల్కతా ఓడిపోయింది. కానీ రింకు సింగ్ సంచలన ఇన్నింగ్స్ తో మాత్రం అభిమానుల మనసుల్ని మరోసారి దోచుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి నికార్సైన  ఫినిషర్ టీమ్ ఇండియాకు అవసరమంటూ ప్రస్తుతం అందరూ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: