ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ క్రమంలోనే బీసీసీఐకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా భాగం కావడానికి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు కూడా సిద్ధమవుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక తమ స్పాన్సర్ల విషయంలో అటు బీసీసీఐ కూడా ఎంతో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంటుంది. ఇకపోతే ఇప్పుడు బీసీసీఐ కొత్త స్పాన్సర్ తో జతకట్టబోతుంది అన్నది తెలుస్తుంది. జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్ ను బీసీసీఐ ఇక తమ కిట్ స్పాన్సర్ గా చేర్చుకోబోతుంది అన్నది తెలుస్తుంది.



 ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్ గా కిల్లర్ జీన్స్ కొనసాగుతుంది. అయితే ఈ కంపెనీతో స్పాన్సర్షిప్ కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ క్రికెట్ కిట్ స్పాన్సర్షిప్ విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త స్పాన్సర్ ని ఆహ్వానించింది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. దేశంలో క్రికెట్ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచ శ్రేణి సంస్థతో జట్టు కలవడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు.



 అయితే ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందింది అనే వివరాలు మాత్రం జై షా వెల్లడించలేదు అని చెప్పాలి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు 350 కోట్ల రూపాయలతో అడిడాస్ కిట్స్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియా తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలబడబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కూడా కనిపించబోతుంది. అంతేకాదు టీం స్పాన్సర్ గా కొనసాగుతున్న బైజుస్ కూడా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నవంబర్ వరకు గడువున్నప్పటికీ కూడా సదర సంస్థ ముందుగానే వైదోలగనుండడంతో కొత్త బిడ్లను ఆహ్వానించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: