ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో 2023 ఐపీఎల్ సీజన్కు తెరపడబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఇక ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. భారత్లో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. కాగా ఫైనల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు అన్న విషయం తెలిసిందే. ఆదివారం మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇక ప్రత్యేకంగా ఫైనల్ కోసం కేటాయించిన రిజర్వుడే అయినా సోమవారం మ్యాచ్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇక ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకి 20 కోట్లు.. రన్నర్పుగా నిలిచిన టీం కి 13 కోట్లు ప్రైస్ మనీ గా ఇస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ ప్రైజ్ మనీ గురించి అందరూ చర్చించుకుంటూ ఉండగా.. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇక టైటిల్ విన్నర్ కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎలా పెరుగుతూ వచ్చింది అన్నది హాట్ టాపిక్ గా మారింది. 2008లో ఐపిఎల్ మొదలైంది. అయితే మొదటి సీజన్లో టైటిల్ విన్నర్ గా నిలిచిన టీం కి..  4.8 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చేవారు. ఈ ప్రైజ్ మనీని 2010లో 10 కోట్లకు మార్చారు. ఇక 2013 సీజన్ వరకు ఇదే ప్రైజ్ మనీ కొనసాగగా.. 2014లో 15 కోట్లకు పెంచారు. ఇక ఆ తర్వాత 2016లో ఈ ప్రైజ్ మనీ 15 నుంచి 20 కోట్లకు మారింది. ఇక ఇప్పటివరకు కూడా ఈ 20 కోట్ల ప్రైస్ మనీనే కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl