తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడిన సమయంలో తన కెరియర్ లో ఇదే చివరి మ్యాచ్ అంటూ ప్రకటించాడు. అయితే కేవలం ఐపిఎల్ నుంచి మాత్రమే కాదు అటు అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు అంబటి రాయుడు. దీంతో ఇక ఈ క్రికెటర్ ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం భారత క్రికెట్లో అంబటి రాయుడు రిటైర్మెంట్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం.



 అంబటి రాయుడు దగ్గర అసాధారణమైన ప్రతిభ ఉన్నప్పటికీ కూడా సెలక్టర్లు అతన్ని పట్టించుకోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక టీమిండియాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు సంపాదించుకున్న అంబటి రాయుడు.. ఇక ఎన్నోసార్లు ఐపీఎల్ లో రాణించి టీమ్ ఇండియాలో చోటు కోసం ఎదురుచూసిన అతనికి నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే బహిరంగంగానే భారత సెలెక్టర్లపై విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అంబటి రాయుడు రిటైర్మెంట్ పై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఎంతో టాలెంట్ ఉన్న క్రికెటర్ అంబటి రాయుడికి టీమ్ ఇండియా మేనేజ్మెంట్ తీవ్ర అన్యాయం చేసింది అంటూ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. 2019 వరల్డ్ కప్ జట్టులోకి కచ్చితంగా అతనికి చోటు దక్కాల్సింది. అంబటి రాయుడు రావడంతో జట్టుకు నాలుగవ స్థానం కష్టాలు కూడా తీరిపోయాయి. దీంతో తప్పకుండా అందరూ అతను వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ అవుతాడని భావించారు. కానీ ఊహించని రీతిలో అతని స్థానంలో విజయ్ శంకర్ కూ అవకాశం ఇచ్చారు సెలెక్టర్లు. కానీ అతను ఎక్కడ నిరూపించుకోలేకపోయాడు. ఇక ఈ ఘటనతో నిరాశ చెందిన అంబటి రాయుడు సెలెక్టర్లను విమర్శించి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక తర్వాత అతనికి పూర్తిగా ఆడే అవకాశం రాలేదు అంటూ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: