దినేష్ నాయుడు.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కొనసాగుతున్నాడు. యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు అటు డైరెక్టర్గా కూడా తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుసగా సూపర్ హిట్ లను ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనను తాను నిలబెట్టుకుంటూ స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు దినేష్ నాయుడు. ఆగండి ఆగండి మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ బాగానే ఉంది కానీ ఈ దినేష్ నాయుడు ఎవరు అంటారా.


దినేష్ నాయుడు మీకందరికీ తెలిసే ఉంటుంది. అయితే దినేష్ నాయుడు పేరుతో కాదు విశ్వక్సేన్ పేరుతో. ప్రస్తుతం యూత్ ఫుల్, లవ్, కమర్షియల్ చిత్రాలతో  మాస్ కా దాస్ గా ప్రేక్షకులకు చేరువయ్యాడు విశ్వక్సేన్. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. దినేష్ నాయుడు పేరును విశ్వక్సేనుగా మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. తను నటించిన ఒక సినిమా రెండేళ్లు వాయిదా పడిందని.. అందుకే పేరు మార్చుకున్నాను అని చెప్పాడు. అనుకొని ఆలస్యం తర్వాత సినిమా విడుదలయితే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు.


 నేను నటించిన వెళ్ళిపోమాకే సినిమా 12 లక్షలు పెట్టి తెరకెక్కించాం. ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ సుమారు 24 నెలల పాటు వాయిదా పడింది. ఇంట్లో వాళ్ళు న్యూమరాలజిస్ట్ కి నా జాతకం చూపిస్తే... దినేష్ నాయుడు అనే పేరుతో ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో గుర్తింపు రాదని.. వీలైతే పేరు మార్చుకోవాలని చెప్పాడు. ఆయన నాలుగు పేర్లు సూచిస్తే అందులో నుంచి విశ్వక్సేన్ అనే పేరును నేను ఎంచుకున్నాను. బెంగాలీ పేరు నీకెందుకు అని ఇంట్లో వాళ్ళు అన్న ఇక అదే పేరుతో సినిమా రిలీజ్ కావాలని ఫిక్స్ అయిపోయా. అలా నా పేరును దినేష్ నాయుడు నుంచి విశ్వక్సేన్ గా మార్చుకున్న.. నెల రోజులకే సినిమా విడుదలైంది. రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత రామానాయుడు స్టూడియోస్ లో తరుణ్ భాస్కర్ కి ఈ నగరానికి ఏమైంది ఆడిషన్ ఇచ్చాను. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎంతో ఓపిక అవసరం అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి: