తెలుగు సినిమా ఇండస్ట్రీ వున్న అన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే నటులు రావు గోపాల్ రావు. ఇక రావు గోపాలరావు జనవరి 14, 1937 న జన్మించారు. ఈయన తెలుగు సినిమాకి మంచి నటుడు, అలాగే 1986 నుంచి 1992 వరకు రాజ్యసభ సభ్యుడుగా వున్నారు.ఇక రావు గోపాల రావు గారి నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు.


నాటకాలంటే ఆసక్తివున్న గోపాలరావును అతని స్నేహితులు ప్రోత్సహించడంతోపాటు ధన్యజీవులు నాటకంలోని నటనకు మంచి పేరు రావడంతో నాటకరంగంలోకి వచ్చాడు. అసోసియేటెడ్ అమెచూర్ డ్రామా కంపెనీ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి అనేక సాంఘిక నాటకాలను ప్రదర్శించాడు. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్రలో ఒదిగిపోయి నటించి, అనేకమందిచే ప్రశంసలు అందుకున్నారు. నాటకరంగంలో పేరు సంపాదించి సినిమారంగంలోకి వెళ్ళినవాళ్ళు తొందరలోనే రాణిస్తారు అనేందుకు రావు గోపాలరావు ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి రాజమహేంద్రవరంలో కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శించినపుడు ముఖ్యఅతిథిగా వచ్చిన సినీనటుడు ఎస్.వి. రంగారావు ఆ నాటకంలో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధుడయ్యాడు.


గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.ఇక రావు గోపాల్ రావుకి 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది.రావు గోపాలరావు మధుమేహవ్యాధి తీవ్రమై, కిడ్నీలు చెడిపోయిన స్థితిలో 1994, ఆగష్టు 13న మరణించారు.ఎప్పటికి కూడా రావు గోపాల్ రావు తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: