మన తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి తెలియ చేసిన ఎంతో మంది దర్శకులు వచ్చారు. అందులో కొందరు మాత్రమే ఎప్పటికీ ప్రజల మనసులో చిరకాలం నిలిచి ఉంటారు. అటువంటి వారిలో ఒకరే నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు కీర్తి శేషులు దాసరి నారాయణరావు. ఈయన తెలుగు సినిమా అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారు. ఈయన తెలుగు సినిమాకు దొరికిన ఒక ఆణిముత్యం. ఈయన తెలుగు సినిమాకు ఎంతో మంది నటే నటులను పరిచయం చేసి వారి జీవితానికి ఒక అర్థం తీసుకువచ్చారు. ఒక దర్శకుడిగా ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో అద్భుతాలు చేశారు. తన కెరీర్ లో 150 చిత్రాలను డైరెక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇది కాకుండా 250 చిత్రాలకు పైగా మాటలు మరియు పాటలు రాశాడు. నటుడిగా కూడా ఎన్నో మైలు రాళ్ళను అందుకున్నాడు. ఇప్పుడు దాసరి తన జీవితంలో అందుకున్న అవార్డులు మరియు పురస్కారాల గురించి తెలుసుకుందాం.

తాతా మనవడు మరియు స్వర్గం నరకం సినిమాలకు గాను దాసరి నంది అవార్డులు దక్కింది.

దర్శకుడి విభాగంలో మేఘ సందేశం మూవీకి ఉత్తమ దర్శకుడిగా నందిని గెలుచుకున్నాడు.

అదే విధంగా మామ గారు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు దాసరిని వరించింది.

తెలుగు సినిమాకు ఎనలేనినేవాల్ను అందించిన దాసరికి ఆంధ్ర యూనివర్సిటీ వారు డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించారు.  

6 సార్లు తెలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్, 5 సార్లు మద్రాస్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ మరియు సినీ హెరాల్డ్ అవార్డును వరుసగా 10 సార్లు గెలుచుకున్నాడు.

ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రపత్రిక నుండి 6 సార్లు సెలెక్ట్ అయ్యాడు.

ఇవన్నీ రికార్డు గా వున్నవే, ఇంకా తన సినిమాలకి సంబంధించి ఎన్నో రికార్డులను అందుకున్నాడు.

ఇలా తెలుగు సినిమా పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన దాసరి అనారోగ్య సమస్యతో 2017 మే 30 న సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: