సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 12, 2004)లో టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో డ‌బుల్ సెంచ‌రీలు, ట్రిఫుల్ సెంచరీలు అంటేనే గొప్ప‌. అలాంటిది ఓ ఆట‌గాడు ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో క్వాడ్రాఫుల్ సెంచ‌రీ సాధించి యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అత‌డే వెస్టిండిస్ క్రికెట్ దిగ్గ‌జం బ్రియాన్ లారా. అప్ప‌టి వరకు ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ గ్యారీ సోబర్స్‌ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును పదేళ్ల తర్వాత లారా 375 పరుగులతో అధిగమించాడు. 

 

లారా రికార్డును బ్రేక్ చేస్తూ ఆస్ట్రేలియా ఓపెన‌ర్ మాథ్యూ హెడెన్‌ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేసి టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2003లో హెడెన్ ఈ రికార్డు సాధించ‌గా యేడాది తిర‌గ‌కుండానే లారా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ టెస్టుల్లో అనితరసాధ్యమైన (400 నాటౌట్‌)  సాధించాడు. లారా రికార్డును అందుకోవాలని చాలా మంది ఆటగాళ్లు ప్రయత్నించారు. ఇక భారత్‌ నుంచి రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన విధ్వంసక ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆ రికార్డును అందుకోలేదు.

 

ఈ రికార్డు సాధించి 16 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌కుండా అలాగే ఉండిపోయింది. 2004 ఏప్రిల్‌లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌ల్లో లారా ఘోరంగా విఫలమయ్యాడు. తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన వెస్టిండిస్ సీరిస్ కోల్పోయినా నాలుగో టెస్టులో లారా విధ్వంస‌క‌ర ఆట తీరుతో గెలుపు చివ‌రి వ‌ర‌కు వ‌చ్చి డ్రా చేసుకుంది. ఇలా ప్ర‌పంచ క్రికెట్లో లారా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌డి లేచిన కెర‌టంగా ఉంటూ త‌న‌దైన ప్ర‌త్యేక‌త చాటుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: