ఈ ఏడాది ఐపీఎల్ పోరు  ఎంతో ఆసక్తికరంగా... ఆశ్చర్యకరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన జట్టు పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుండగా  ఎలాంటి అంచనాలు లేని జట్లు  మాత్రం అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన రాణిస్తూ పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉంటే. ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్టు గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం పేలవ ప్రదర్శన చేస్తూ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 13 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ఎంతో అద్భుతంగా సాగింది అనే చెప్పాలి.



 ఎప్పుడూ పాయింట్ పట్టికలో  టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ప్రత్యర్థి జట్టును చిత్తు చేస్తూ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోయేది. ఇక ఇప్పటి వరకు ఆడిన ప్రతి సీజన్లో కూడా ప్లే ఆప్ కి అర్హత సాధించిన ఒకే ఒక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఈ సీజన్లో మాత్రం అంతా తారుమారు అయిపోయింది. మొదట ముంబై పై  విజయంతో ప్రస్థానాన్ని ప్రారంభించిన సూపర్ కింగ్స్ జట్టు ఆ తరువాత మాత్రం వరుస ఓటముల చవి చూస్తూనే ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు  ఆడితే కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అన్ని విభాగాల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెత్త ప్రదర్శన చేస్తోంది.



 ఇక ప్రతి మ్యాచ్ ఓటమి అనంతరం మహేంద్రసింగ్ ధోని జట్టు ఓటమికి గురించి ఏదో ఒక కారణం చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేంద్రసింగ్ ధోని చెబుతున్న కారణాలపై అటు మాజీలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న ముంబై చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరుగగా చెన్నై పేలవ  ప్రదర్శన చేసి ముంబై చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అనంతరం మాట్లాడిన ధోని.. ఓడిపోవడం ఎంతో బాధించిందని.. ఈ ఏడాది తమది కాదు అంటూ వ్యాఖ్యానించాడు.. వరుస ఓటములతో జట్టులోని సభ్యులు కూడా బాధపడుతున్నారని తర్వాత మ్యాచ్ లో  గెలిచేందుకు ప్రయత్నిస్తాము  అంటూ చెప్పుకొచ్చాడు ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: