ఐపీఎల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మునుపెన్నడూ లేనివిధంగా పేలవ ప్రదర్శన చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటున్న  విషయం తెలిసిందే. ఏ ఒక్క మ్యాచ్లో కూడా ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఈసారి టైటిల్ గెలిచి తీరుతుంది అని అభిమానులు అనుకున్న తరుణంలో కనీసం ప్లే ఆప్ కి కూడా అర్హత సాధించలేదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ నెలకొంది అనే చెప్పాలి.



 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఒక్క  ఆటగాడు కూడా ఏ  మ్యాచ్లో రాణించిన దాఖలాలు లేవు. ఒకవేళ రాణించినా అది ఒకటి రెండు మ్యాచ్ లకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుకు సాగుతున్నప్పటికీ... చివరికి విజయం సాధించలేక ప్రత్యర్థి ముందు డీలా పడిపోతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఐపీఎల్లో దిగ్గజ జట్టుగా పేరున చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాదాసీదా జట్ల ముందు సైతం ప్రస్తుతం ఓడిపోతుంది.



 ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్లో కూడా చెత్త ప్రదర్శన చేస్తూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అన్ని విభాగాల్లో కూడా ఘోరంగా విఫలమవుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో చెప్పుకోవాల్సిన ఆటగాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది యువ ఆటగాడు సామ్ కర్రాన్  గురించి అని చెప్పాలి. ఎందుకంటే సామ్ కర్రాన్  ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అతనికి ఎప్పుడు బంతిని ఇచ్చిన ఏ స్థానంలో బ్యాటింగ్ కి పంపిన సత్తా చాటి జట్టును విజయతీరాలకు వైపుకు నడిపించేందుకు ప్రయత్నాలు చేశాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు సామ్ కర్రాన్ . ముఖ్యంగా ఈ సీజన్లో జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ మునుపెన్నడూ లేని విధంగా జై లవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: