యువ ఆటగాడు అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఎంతో పరిణితి కనబరుస్తూ జట్టును ఎంతో సమతూకం తో ముందుకు తీసుకెళ్ళాడు. ఈ క్రమంలోనే మొదటినుంచీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతు వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఇక మొదటిసారి ఫైనల్కు చేరి ముంబై ఇండియన్స్ తో పోరాడింది. అయితే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెట్టు ఒత్తిడిని తట్టుకోలేక చివరికి ఒక్క అడుగు దూరంలో టైటిల్ గెలవలేకపోయింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి చవిచూసి రన్నరప్ తో సరిపెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.
ఇక ఢిల్లీ కాపిటల్స్ ఓటమిపై తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ సీజన్ లో ఒక్క అడుగు దూరంలో ఓడటం ఎంతో బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు. తమ టీం ఎంతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది అంటూ కొనియాడారు రికీపాంటింగ్. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ లో తమ జట్టును మరింత బలం గా మార్చుకుని రంగంలోకి దిగుతాము అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చారు. 2021 ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలిచేది తమ జట్టు అంటూ ధీమా వ్యక్తం చేశాడు రికీపాంటింగ్. ఇక జట్టు ఈ విజయంలో అందరూ కీలక పాత్ర వహించారు అంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి