ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించారు వీరేంద్ర సెహ్వాగ్. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ పరుగులు బోర్డును పరుగులు పెట్టించి సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. భారత ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అయితే సరిగ్గా ఇదే రోజున వీరేంద్ర సెహ్వాగ్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. 2011 డిసెంబర్ 8వ తేదీన అంటే సరిగ్గా ఇదే రోజున దశాబ్దాల రికార్డును బ్రేక్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన రెండవ క్రికెటర్గా వీరేంద్ర సెహ్వాగ్ అవతరించాడు.
2011 డిసెంబర్ 8వ తేదీన వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్లో ఏకంగా 143 బంతుల్లో 219 పరుగులు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. వీరేంద్ర సెహ్వాగ్ విజృంభించి ఆడటంతో టీమిండియా వన్డే మ్యాచ్లో 418 పరుగులు చేసింది అయితే ఇప్పటి వరకు టీమిండియా వన్డే చరిత్రలో 418 పరుగుల అత్యధిక కావడం గమనార్హం. ఇప్పుడువరకు ఒక్కసారి కూడా టీమిండియా 418 పరుగుల కు మించి చేయలేదు వన్డే మ్యాచులలో. ఇక కేవలం వన్ డే మ్యాచ్ లలో మాత్రమే కాదు టెస్టుల్లో కూడా త్రిబుల్ సెంచరీలు సాధించి అరుదైన ఘనత సాధించాడు వీరేంద్ర సెహ్వాగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి