దేవదత్త పడిక్కాల్  గుర్తున్నాడా... ఐపీఎల్ లో సత్తా చాటి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ మొదటి ఐపీఎల్ సీజన్ తోనే  ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న యువ ఆటగాడు దేవదత్త పడిక్కాల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కోసం ఆడిన  దేవదత్త పడిక్కాల్  యువ ఆటగాడు అయినప్పటికీ ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ అద్భుతంగా రాణించి అందరి ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే .  ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ఇటీవల..  మరోసారి దేవదత్  పడిక్కాల్  వారెవ్వా అనిపించాడు. తనదైన బ్యాటింగ్  తో అదరగొట్టే అందరిని ఆకర్షించాడు.  అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఇరగదీశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన దేవదత్  పడిక్కాల్   మరోసారి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అనే చెప్పాలి. విజయ్ హజారే ట్రోఫీ లో దేవదత్  పడిక్కాల్ సూపర్ డూపర్ హిట్ అయ్యాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విజయ్ హజారే ట్రోఫీ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 5 మాచర్ల లోనే 557 పరుగులు చేశాడు దేవదత్  పడిక్కాల్.



 స్ట్రైక్ రేట్ ఏకంగా 190 మెయింటెన్ చేయడం గమనార్హం. ఇక యువ ఆటగాడి స్పీడు చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే టీం ఇండియా లో చోటు దక్కించుకోవడం పక్క అనే రేంజ్ లో ఆడుతున్నాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించిన దేవదత్  పడిక్కాల్ అదే ఫామ్  కొనసాగిస్తూ విజయ్ హజారే ట్రోఫీ లో కూడా అదరగొట్టడం ఇక ఆ తర్వాత మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ లో కూడా సత్తా చాటేందుకు ఈ యువ ఆటగాడు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ యువ ఆటగాడు ప్రదర్శనకు ఫిదా అవుతున్న మాజీ లు  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: