ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడిన భారత జట్టు అద్భుతంగా రాణించి చివరికి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ లోకి కూడా అడుగు పెట్టింది అనే విషయం తెలిసిందే.  అయితే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్ జట్టును  క్లీన్ స్వీప్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది టీమిండియా. దీంతో టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.  ఇక ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది టీమిండియా.


 వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఇంగ్లాండ్ పై  టెస్ట్ సిరీస్ గెలిచి టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో కి టీమిండియా చేరింది.  ఇకపోతే అద్భుత పోరాటం చేసి టీమిండియాకు విజయం అందించిన టీమిండియా ఆటగాళ్లు ప్రదర్శనపై ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫన్నీ పోస్టులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర.




 ఇక ఇటీవలే ఇంగ్లండ్ జట్టుపై టెస్ట్ సిరీస్ గెలిచి టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో లోకి అడుగుపెట్టిన టీమిండియా పై ప్రశంసల వర్షం కురిపించిన వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఇక ఈ టెస్టు చాంపియన్షిప్ విజయంలో కీలకపాత్ర వహించిన అక్షర్ పటేల్ ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దుమ్ములేపి..  సిరీస్ను మీ జేబులో వేసుకున్నారు. అభినందనలు..  దీన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు నాకు అక్షర్ పటేల్ పెట్టుకున్న కళ్ళద్దాలు కావాలి. అక్షర్ పటేల్ పెట్టుకున్న కళ్ళద్దాలు ఏ బ్రాండ్..  ఎక్కడ దొరుకుతాయి అంటూ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: