భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ అసలుసిసలైన క్రికెట్ మజా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక అసలు సిసలైన క్రికెట్ మజా అంటే  ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బీసీసీఐ. ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ కాస్త క్రికెట్ ప్రేక్షకులందరికీ క్రికెట్ మజా డబుల్  చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకూ సహచరులుగా ఉన్న ఆటగాళ్లందరూ ప్రత్యర్థులుగా మారి  హోరాహోరీగా తలపడుతూ  ఉంటారు. ఇక ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లు సహచరుల గా మారిపోయి.. జట్టు కోసం పోరాడుతూ ఉండటం లాంటివి కేవలం ఐపీఎల్లో మాత్రమే సాధ్యం అవుతుంటాయి.



 గత ఏడాది కరోనా  వైరస్ కారణంగా యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. అంతేకాకుండా సమ్మర్లో నిర్వహించాల్సిన ఐపీఎల్ కాస్త ఏడాది చివర్లో నిర్వహించిన విషయం తెలిసిందే.కానీ ఈ ఏడాది మాత్రం అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించాలి అని భావించి కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఐపీఎల్ నిర్వహణ కోసం  కసరత్తులు చేసింది బిసిసిఐ. ఇక ఇటీవల ఫిబ్రవరి నెలలో మినీ వేలం కూడా నిర్వహించింది. ఇక ఐపీఎల్ నిర్వహణ కోసం ఇటీవల షెడ్యూల్ కూడా ప్రకటించింది బిసిసిఐ. దీంతో ఐపీఎల్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రావడంతో  ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.



 ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఇక మే 30వ తేదీన ఐపీఎల్ ఫైనల్ నిర్వహించనుంది బీసీసీఐ. ఇక ప్రతి రోజు మ్యాచ్లు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు, సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ పూర్తిగా ఐపీఎల్ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అదేంటంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఏ ఒక్క జట్టు కూడా తమ హోమ్ గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడటం లేదు. అహ్మదాబాద్ బెంగుళూరు ముంబై చెన్నై కోల్కతా ఢిల్లీ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు  జరుగుతున్నాయి  అనే విషయం తెలిసిందే. ఇక ఈ సారి హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించేందుకు మాత్రం అవకాశం రాలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: