
దీంతో ఇక ఇంటర్వ్యూ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇంటర్వ్యూలో జస్ట్ బూమ్రా సతీమణి సంజన గణేషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు ఈ స్టార్ ప్లేయర్. అంతేకాదు తన పాత జ్ఞాపకాలను కూడా ఈ సందర్భం గా పంచుకున్నారు. తన 27ఏళ్ల నాటి ఇంస్టాగ్రామ్ జ్ఞాపకాలను ఈ సందర్భం గా చూపించాడు. టి20 ఆడుతున్న సమయంలో నాలుగు ఓవర్లు వేసి రెండు పరుగులు ఇచ్చాను ఆ తర్వాత వికెట్లు కూడా తీసుకున్నాను. అయితే తన కెరియర్ లో మొదటి అతి పెద్ద ప్రదర్శన అదే అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది ప్రారంభంలో గబ్బా స్టేడియంలో టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయం గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు జస్ప్రిత్ బూమ్రా. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో టీమిండియా గబ్బా స్టేడియంలో చారిత్రాత్మక విజయం సాధించిందని చెప్పుకొచ్చాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ విజయాలు ఎంతగానో సంతోష పెట్టాయ్ అని తెలిపాడు సీనియర్ ప్లేయర్స్ లేకపోయినప్పటికీ యువకులు జట్టుకు విజయం అందించిన తీరు ఆశ్చర్యపరిచింది అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఇలా సంజన గణేశన్ బుమ్రా నూ చేసిన ఇంటర్వ్యూ కాస్త ఎంతో ఆసక్తికరంగా సాగిపోయింది.