క్రికెట్ ఆటలో ప్రతి ఆటగాడికి షూస్ అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ఒకసారి మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లు ఎంతో వేగంగా కదులుతూ ఉంటారు. కాబట్టి సౌకర్యవంతమైన షూస్ లేకపోతే ఇక ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే క్రికెట్ ఆటగాళ్లు అందరూ ఎంతో నాణ్యతగల బూట్లు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక క్రికెట్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకం గా కొన్ని కంపెనీలు షూస్ తయారు చేస్తూ ఉంటాయి  తక్కువ బరువుతో మంచి నాణ్యతతో కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎంతో సౌకర్యవంతంగా నడిచేలా పరిగెత్తేలా తయారు చేస్తూ ఉంటారు.
 సగటున ప్రతి మ్యాచ్లో ఒక ఆటగాడు ఐదు కిలోమీటర్ల వరకు పరుగులు తీస్తాడట.. ఇక ఇంత దూరం పరిగెత్తడం వల్ల ప్రతీ ఆటగాడికి మోకాలు చీలమండ పై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.  అందుకే ఇక సౌకర్యవంతమైన  షూస్  చేసుకోవడం వల్ల ఇలాంటి బాధ నుంచి ఆటగాళ్ళు తప్పించుకోగలుగుతారు.



కొన్నిసార్లు మైదానాలు జారేలా ఉంటాయి  అయితే ఫీల్డర్లు ఎక్కువగా ఆంటీ స్కిడ్ అంటే స్పైక్ ఉన్న బూట్లు వేసుకోవటం ఎంతో మంచిది అని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు మ్ ఈ రోజుల్లో ఎక్కువగా బూట్లు స్పైక్ ల తో వస్తున్నాయి. ఇది మైదానంలో ఆటగాళ్లు జారీ పడకుండా గ్రిప్ అందిస్తూ ఉంటాయి.

 ఇక ఆల్రౌండ్ రకం ఆటగాళ్లు... స్పైక్ షూస్ తో ఎక్కువగా ఆడటానికి ఇష్టపడని ఆటగాళ్లకు రబ్బరు స్టుడ్ లతో కూడిన షూస్ అనుకూలంగా ఉంటాయి. ఇది ఆటగాళ్ళకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే క్రికెట్ ఆటగాళ్ల లో ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు ఎంతో అనువైన సౌకర్యవంతమైన బూట్లు అవసరం ఉంటుంది  షూస్ స్థిరత్వం మంచి పరిపుష్టి మంచి మన్నిక కలిగిన షూస్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు.  అందుకే ఫాస్ట్ బౌలర్లు డబుల్ కుషన్ క్రికెట్ బూట్లు వేసుకుంటూ ఉంటారు ఇక మరికొంతమంది ఫాస్ట్ బౌలర్లు స్పైక్ బూట్లు ఉపయోగిస్తారు. తద్వారా వాళ్ళు బౌలింగ్ చేసే సమయంలో పరుగెత్తుతుండగా ఎక్కువగా ట్రాక్షన్ ఫోర్స్ పొందుతూ ఉంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: