కానీ డబుల్ సెంచరీ కొంతదూరంలో వికెట్ కోల్పోయి ఇక డబుల్ సెంచరీ కి దూరం అయిపోయారు. కానీ ఇక్కడ ఒక యువ క్రికెటర్ మాత్రం టీ20 లో మొదటి డబుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ కు చెందిన యువ క్రికెటర్ శుభోద్ బాటి ఈ ఘనతను సాధించాడు. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఓ టి20 టోర్నీలో ఢిల్లీ ఎలెవెన్ న్యూ జట్టు తరఫున ఆడాడు. సింబ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 79 బంతుల్లోనే 205 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 17 ఫోర్లు 17 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టి20 చరిత్రలోనే మొదటి సారి డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
దీంతో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ చూపు మొత్తం యువ క్రికెటర్ ఆకర్షించాడు. ఇక యువ ఆటగాడు ఊపు ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడం కూడా ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఇప్పుడు వరకు టీ20 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ల జాబితాను పరిశీలిస్తే.. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ లో ఏకంగా 65 బంతుల్లోనే సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడి 175 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 2018 లో 76 బంతుల్లో 172 పరుగులు చేశాడు. ఇలా స్టార్ ఆటగాళ్లకు సైతం సాధ్యంకాని రికార్డుల్ని ఇటీవలే ఒక యువ ఆటగాడు సాధించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి