ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్ గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా ఎప్పుడు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. తనదైన శైలిలో వైవిధ్యమైన బంతులు సంధిస్తూ కీలకమైన  వికెట్లు పడగొడుతూ ఉంటాడు. అంతేకాకుండా ప్రస్తుతం టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కూడా జస్ప్రిత్ బూమ్రా కొనసాగుతున్నాడు. అయితే టీమిండియాలో కీలక బౌలర్ అయిన ఈ ఆటగాడు అటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో ఏళ్ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు అనే చెప్పాలి.



 ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో ఎప్పుడు కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను తనదైన యార్కర్లతో ఇబ్బంది పెడుతూ తక్కువ పరుగులకే కట్టడి చేయడమే కాదు అటు వికెట్లు పడగొడతాడు..  జట్టుని విజయం వైపు తీసుకు వెళుతూ ఉంటాడు బుమ్రా . అయితే ఐపీఎల్ లో ఎంతో మంది ఆటగాళ్లు అటు బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడానికి ఎంతగానో ఇబ్బందిపడుతుంటారు.  కొన్నిసార్లు సాహసం చేసి బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి చివరికి వికెట్లు చేజార్చుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా చాలామంది బ్యాట్స్మెన్లు బుమ్రా బౌలింగ్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుమ్రా బౌలింగ్ ను ఒకే ఒక్కడు బాగా ఎదుర్కోగలడు అంటూ ఇటీవలే భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.


 ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక బౌలర్ అయిన జస్ప్రిత్ బూమ్రాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాట్స్మెన్ డివిలియర్స్ బాగా ఆడగలడు అంటూ చెప్పుకొచ్చాడు. డివిలియర్స్, మాక్స్వెల్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండడం కోహ్లీ అదృష్టం అంటూ తెలిపాడు. అయితే బుమ్రా ని  ఎదుర్కోవడంలో మాక్స్వెల్ కంటే డివిలియర్స్ ఎంతో సమర్ధుడు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎన్నోసార్లు డివిలియర్స్ బుమ్రా బౌలింగ్లో భారీ పరుగులు చేసి ఇది నిరూపించాడు.  ఇలా బుమ్రా బౌలింగ్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న బ్యాట్స్మెన్ ఇంకొకరిని చూడలేదు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl