బిసిసిఐ ప్రతి ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది   అయితే బిసిసిఐ 2008లో ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటి వరకు ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అనే చెప్పాలి. ప్రతి సీజన్లో కూడా ఐపీఎల్కు అంతకంతకూ ఒక క్రేజ్ వస్తుంది. ఈ క్రమంలోనే అటు విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్లో భాగం కావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవాలనుకునే యువ ఆటగాళ్లకు తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్ ఒక మంచి వేదికగా మారిపోయింది.  ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ఐపీఎల్ సూపర్ స్టార్ గా మారిపోతున్నారు.


 కాగా ప్రస్తుతం ఐపీఎల్లో ఎనిమిది జట్లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ ఎనిమిది జట్లు మధ్య ప్రతి సీజన్లో కూడా ఎంతో హోరాహోరీ పోరు జరుగుతూనే ఉంటుంది. అయితే ఐపీఎల్ ఎంటర్ టైన్ మెంట్ ను మరింత పెంచేందుకు అటు బిసిసిఐ గత కొన్ని రోజుల నుంచి తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లోకి మరో రెండు కొత్త జట్లను తీసుకురావాలని బిసిసిఐ ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమైంది. ఇటీవలే ఐపీఎల్ లోకి వచ్చే రెండు జట్లు ఏవి అన్నది కూడా ఫిక్స్ అయిపోయింది.


 ఇకపోతే ఐపీఎల్ లో కి రెండు కొత్తజట్లు  వచ్చిన తర్వాత టోర్నీ తీరును మొత్తం మార్చడానికి బిసిసిఐ ప్లాన్ చేస్తోందట. ఇప్పటివరకు కేవలం 8 జట్లు మాత్రమే ఐపీఎల్లో తలపడగా ఇక వచ్చే సీజన్ నుంచి మాత్రం పది జట్లు పోటీ పడబోతున్నాయి. అయితే ఎప్పటి లాగానే లీగ్ దశలో ఒక జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. కానీ 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కొక్క గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ఇక ఈ ఐదు జట్ల మధ్య హోమ్ 4, అవే 4 అంటూ 8 మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత మరో గ్రూప్ నుండి ఒక్కొక్క జట్టుతో ఒక మ్యాచ్.. ఇక ఆ తర్వాత ఒక జట్టుతో రెండు మ్యాచ్లు జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాగా ఇలాంటి సరికొత్త ఫార్మాట్ ని ఐపీఎల్ లో అమల్లోకి తీసుకురావాలని బిసిసీఐ ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl