ఈ క్రమంలోనే మూడో మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్న టీమిండియా ఏకంగా ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ పై 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ విభాగం అదరగొట్టింది అనే చెప్పాలి. అయితే ఇక నేడు స్కాట్లాండ్లో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడబోతుంది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోతేనే భారత జట్టుకు సెమీఫైనల్కు వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఇక సెమీఫైనల్కు వెళ్లడం చాలా కష్టమే. అందుకే భారత అభిమానులు అటు న్యూజిలాండ్ జట్టు ఓడిపోవాలి అని కోరుకుంటున్నారు.
కేవలం అభిమానులు మాత్రమే కాదు భారత జట్టులోని ఆటగాళ్లు సైతం న్యూజిలాండ్ జట్టు ఓడిపోవాలని ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నారూ. ఇక ఇటీవల ఈ విషయాన్ని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చెప్పుకొచ్చాడు. టీమ్ ఇండియా సెమీ ఫైనల్ తీరాలంటే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ జట్టును ఓడించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ ఆడబోయే మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు రవిచంద్రన్ అశ్విన్. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత అభిమానుల పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ జుట్టు బాగా ఆడుతుందని అదే సమయంలో కివీస్ పోటీ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నాలుగేళ్ల తర్వాత మళ్లీ టి20 లోకి పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి