క్రికెట్ మ్యాచ్ వస్తోందంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో కొన్నిసార్లు ఊహించని విధంగా మ్యాచ్ ఆగిపోతూ ఉంటుంది. అయితే వర్షం రావడం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. లేదంటే వెలుతురు తక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా ఫీల్డ్ అంపైర్లు పూర్తిగా వాతావరణాన్ని చెక్ చేసి మ్యాచ్లను మధ్యలో నిలిపివేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మైదానంలోకి కుక్క పిల్లలు పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. ఇలా జరిగిన సమయంలో కూడా కాసేపటి వరకూ మ్యాచ్ ఆగిపోతు ఉంటుంది. అయితే ఇప్పటివరకు దాదాపుగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఇలా వివిధ కారణాల వల్ల మ్యాచ్ నిలిచిపోవడం చూసే ఉంటారు.


 కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రమైన కారణంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఏకంగా ఒక కెమెరా వల్ల మ్యాచ్ నిలిచిపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో చివరి బంతికి కివీస్ కెప్టెన్ టామ్ లూతమ్ ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. ఆ సమయంలో ఇక అక్కడ మొత్తం చిత్రీకరించేందుకు ఉపయోగించే స్పైడర్ కెమెరా కి పిచ్చి కి కొంత ఎత్తులో ఎటు కదలకుండా అక్కడే ఆగిపోయింది.



 సిబ్బంది దానిని పైకి లాగేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఈ సమస్య పరిష్కరించడానికి కొంత సమయం పట్టింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు  విరామం ప్రకటించారు.. ఇక స్పైడర్ కెమెరా ఆగిపోవడంతో మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు ఆ కెమెరా వద్ద సరదాగా ఆడుకున్నారు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమైంది పైకి పో అంటూ సరదాగా వెళ్ళిపోయాడు.. ఇక రవిచంద్రన్ అశ్విన్ బాహుబలిలో ప్రభాస్ శివలింగం ఎత్తుకున్నట్లుగా ఫోజులు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: