ప్రస్తుతం భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా కొనసాగుతున్నారూ కొంత మంది ఆటగాళ్లు. ఇలాంటి ఆటగాళ్లలో ఛటేశ్వర్ పూజార కూడా ఒకరు. భారత జట్టులోకి అరంగేట్రం చేసిన కొన్ని రోజుల్లోనే స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా పేరుతెచ్చుకున్నాడు  పుజారా.  దీంతో ఇక పుజారాకు వన్డే, టి20 ఫార్మాట్లలో పూర్తిగా స్థానం లేకుండానే పోయింది అని చెప్పాలి. కానీ టీమ్ ఇండియా ఆడిన ప్రతీ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం చటేశ్వర్ పుజారా స్థానం సంపాదించుకున్నాడు. అయితే నెమ్మదైన ఆటతీరుకు పూజారా కేరాఫ్ అడ్రస్ అయిన విషయం తెలిసిందే.


 సాధారణంగా టెస్టు క్రికెట్లో ఎంతో నెమ్మదిగా ఆడుతూ పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎంతో నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో భారత్ జట్టుకు నయ వాల్ అంటూ పేరు తెచ్చుకున్నాడు.. అయితే గత కొంత కాలం నుంచి పూజారా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ వాటిని భారీస్కోరుగా మలచడంలో విఫలం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఛటేశ్వర్ పూజారా ఫామ్ పై ప్రస్తుతం ప్రస్తుతం మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.




 దాదాపు మూడేళ్లుగా చటేశ్వర్ పుజారా టెస్ట్ లో సెంచరీ చేయకపోవడం భారత జట్టును ఆందోళన కలిగిస్తోంది అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. ప్రస్తుతం మిడిలార్డర్ స్థానం కోసం శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, గిల్ ఇలాంటి యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఉంటుందని వారు టెస్ట్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తూ ఉండటంతో పూజారా స్థానం రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది అంటూ వ్యాఖ్యానించారు వి.వి.ఎస్.లక్ష్మణ్. ప్రస్తుతం మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న పుజారా సెంచరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని కాని దానిని అతను ఉపయోగించుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vvs