ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఎంత దిగ్గజ ఆటగాడి గా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో ఎప్పుడు దూకుడుగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. మొన్నటివరకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కూడా ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే సాధించి తన పేరును లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ.


 ఇలాంటి విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాలని ఏ బౌలర్కు ఉండదు చెప్పండి. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్న బౌలర్లు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్గా కొనసాగుతున్న వారి వికెట్ పడగొట్టాలి ఎంతో ఆశ పడుతూ ఉంటారు. ఇలా బౌలర్లు ఎక్కువగా ఆశపడేది విరాట్ కోహ్లీ వికెట్ గురించి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ వికెట్ ను పడగొట్టి కలను నిజం చేసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మరో యువ బౌలర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు శ్రీలంక స్పిన్నర్ వహీద్ హసరంగా.


 అయితే తనకు విరాట్ కోహ్లీ అంటే ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ వికెట్ ఎప్పటికైనా పడగొట్టడం తన చిరకాల కోరిక అంటూ శ్రీలంక స్పిన్ సంచలనం వాహిదూ  హాసరంగా చెప్పుకొచ్చాడు. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా   నిలిచిన ఈ ఆటగాడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. ఐపీఎల్ లోకూడా అద్భుతంగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ఆర్సిబి తరఫున ఆడిన ఈ స్పిన్నర్ ఏకంగా విరాట్ కోహ్లీ క్రికెట్ పడగొట్టాలని కోరిక ఉంది అని చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: