అయితే సాధారణంగా పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇక ఆ మ్యాచ్ ఎంత హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టి20 వరల్డ్ కప్ లో కూడా ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ అందరిని ఆకర్షించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు భారత ప్లేయర్స్ మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంది. టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ తో మాట్లాడి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా మెంటార్ గా ఉన్నా మహేంద్రసింగ్ ధోని పాకిస్తాన్ ఆటగాళ్లతో ముచ్చటించిన తీరు కూడా ఎంతో మందిని ఆకర్షించింది.
అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజామ్ లు ఏం మాట్లాడుకున్నారు అన్నది మాత్రం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీని గురించి ఇప్పటి వరకు ఎక్కడా బయటికి రాలేదు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ లో టాస్ సమయంలో ఆకలితో ఏం మాట్లాడారు అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. మేము ఏం చర్చించుకున్నామో ఎప్పటికీ బయట పెట్టను బహిరంగంగా అందరి ముందు ఆ విషయం గురించి అస్సలు మాట్లాడను అంటూ బాబర్ అజామ్ సమాధానం చెప్పాడు. దీంతో అంత సీక్రెట్ వీరిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారబ్బా అంటూ అందరిలో మరింత ఆసక్తి పెరిగిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి