సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా ప్రస్తుతం జోహన్నెస్బర్గ్ వేదికగా రెండు టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తుంది  అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే రెండవ టెస్ట్ మ్యాచ్ కి ముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కోహ్లి వెన్నునొప్పి కారణంగా దూరం అయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ గా ఉన్న కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టి జట్టుకు ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా ఎలా రాణించ పోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో భాగంగా తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ సమయంలో వెంటనే సౌత్ ఆఫ్రికా బౌలర్ రబడా కు కె.ఎల్.రాహుల్ క్షమాపణలు చెప్పాడు. ఇన్నింగ్స్ లో ఐదు ఓవర్ లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు రబడా. అతడు బంతి వేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కె.ఎల్.రాహుల్ క్రీజులో నుంచి పక్కకు జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వెంటనే రబడా తోపాటు అంపైర్ వైపు చెయ్యి చూపిస్తూ క్షమాపణలు చెప్పాడు కేఎల్ రాహుల్. దీంతో ఇక కె.ఎల్.రాహుల్ ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు అభిమానులు.



 ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ పరుగులు చేస్తోంది అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా 202 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరికి భారత బ్యాట్స్మెన్లు వికెట్ చేజార్చుకున్నారు ఇక టీమిండియా బ్యాటింగ్ లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక బ్యాట్స్మెన్లు   అందరూ విఫలమైన సమయంలో బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. 46 పరుగులతో రాణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: